telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రపంచంలో నా ప్రేయసే హాటెస్ట్… ప్రముఖ సింగర్

Blake

ప్రముఖ అమెరికన్ సింగర్ బ్లేక్ షెల్టన్‌ తన ప్రేయసి ఈ ప్రపంచంలోనే హాటెస్ట్ అంటుంన్నాడు. ఆమె అతని కంటే అతని ప్రేయసే వయసులో పెద్దది. గ్వెన్ వయసు 50, బ్లేక్‌కు 43. వీరిద్దరికీ ఇదివరకు పెళ్లిళ్లు జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్యులతో విడిపోయారు. ఇటీవల అమెరికాలో కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డ్స్ జరిగాయి. ఈ వేడుకకు బ్లేక్ తన గర్ల్‌ఫ్రెండ్ గ్వెన్ స్టెఫనీని తోడు తీసుకెళ్లాడు. ఈ వేడుకలో బ్లేక్ ట్రోఫీని అందుకున్నాడు. ఈ సందర్భంగా బ్లే్క్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో ‘నువ్వేం గెలుచుకున్నావ్’ అని గ్వెన్ తన ప్రియుడిని ప్రశ్నించింది.ఇందుకు బ్లేక్ స్పందిస్తూ.. ‘ఈ ప్రపంచంలోనే గొప్ప అందగత్తెను గెలుచుకున్నాను’ అన్నాడు. ఆ తర్వాత గ్వెన్ మళ్లీ ప్రశ్ని్స్తూ.. ‘అది కాదు నువ్వు గెలుచుకున్న అవార్డు గురించి అడుగుతున్నాను’ అంది. ఇందుకు బ్లేక్ స్పందిస్తూ.. ‘నేను నా మ్యూజిక్‌కి అవార్డ్ గెలుచుకున్నాను. కానీ అంతకంటే గొప్ప అవార్డ్ నా హాటెస్ట్ ప్రేయసే’ అని పేర్కొంటూ తన ప్రేయసిని ముద్దులతో ముంచెత్తాడు.

Related posts