telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

త్వరలో బ్లాక్‌బెర్రీ మెసెంజ‌ర్ సేవలు నిలిపివేత‌!

BlackBerry BBM Consumer Service

ప్ర‌ముఖ మొబైల్స్ కంపెనీ బ్లాక్‌బెర్రీ త‌న మెసెంజర్ సేవ‌ల‌ను మే 31వ తేదీ నుంచి నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఇక‌పై బ్లాక్‌బెర్రీ మెసెంజ‌ర్ (బీబీఎం) సేవ‌లు యూజ‌ర్ల‌కు ల‌భ్యం కావ‌ని ఆ కంపెనీ తెలిపింది. చాలా మంది యూజ‌ర్లు ప్ర‌స్తుతం ప‌లు భిన్న‌మైన ఇన్‌స్టంట్ మెసెంజ‌ర్‌ల‌ను వాడుతున్నార‌ని, అందుకే బీబీఎం సేవ‌ల‌ను నిలిపివేస్తున్నామ‌ని బ్లాక్‌బెర్రీ తెలిపింది. 

. అయితే కొత్త‌గా బ్లాక్‌బెర్రీ మెసెంజ‌ర్ ఎంట‌ర్‌ప్రైజ్ (బీబీఎంఈ) పేరిట మ‌రో నూత‌న మెసేజింగ్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చామ‌ని బ్లాక్‌బెర్రీ తెలిపింది. దీన్ని వ్య‌క్తులు, కార్పొరేట్ సంస్థ‌లు వాడుకోవ‌చ్చ‌ని తెలిపింది. , మొద‌టి సంవ‌త్స‌రం ఈ యాప్ సేవలు ఉచితంగానే ల‌భిస్తాయ‌ని, త‌రువాత 6 నెల‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్‌కు రూ.172 చెల్లించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

Related posts