telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బ్లాక్ రోజ్ : దుమ్మురేపుతున్న “నా తప్పు ఏమున్నదబ్బా” వీడియో సాంగ్

Black-Rose

మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ‘బ్లాక్ రోజ్’. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ సాంగ్‌ను యూనిట్ తాజాగా విడుదల చేసింది. “నా తప్పు ఏమున్నదబ్బా” అంటూ సాగే ఈ పాటలో ఊర్వశి దుమ్మురేపే డ్యాన్సులతో మతి పోగొడుతోంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్ పతాకంపై తెరకెక్కుతున్న ‘బ్లాక్ రోజ్’ సినిమాలో ఊర్వశి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఏమైంది ఈవేళ, రచ్చ , బెంగాల్ టైగర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. షేక్‌ స్పియ‌ర్‌ రచించిన “ది మర్చంట్ ఆఫ్ వెనిస్”లోని జ్యూయిష్ మనీ లెండర్ షైలాక్ పాత్ర ఆధారంగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్ నెం:4గా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్నేహ గీతం, దొంగాట చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Related posts