telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

బ్లాక్ హోల్ .. ఫోటో వచ్చేసింది.. చూశారా.. !

black hole photo captured by scientists

తన సమీపంలోకి వచ్చే దేన్నయినా సరే మింగేసి మాయం చేసే అంతరిక్ష విన్యాసం ‘కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్’. బ్లాక్ హోల్ అనే పేరును వినడం తప్ప, దానికి సంబంధించిన చిత్రాలేవీ ఇంతవరకూ మనం చూడలేదు. కానీ, శాస్త్రవేత్తల రెండేళ్ల శ్రమ ఫలితంగా తొలిసారి కృష్ణబిలం ఫోటో బయటకు వచ్చింది. మధ్యలో నల్లగా, చుట్టూ నారింజ రంగు తేజోవలయంతో ఇది కనువిందు చేస్తోంది. మానవ చరిత్రలో కృష్ణబిలాన్ని చిత్రం తీయం ఇదే మొదటిసారి. భారీ టెలీస్కోపును వినియోగించి, గురుత్వాకర్షణ సాయంతో మనకు కనిపించకుండా విశ్వంలో తిరుగుతున్న ఈ ఖగోళ వింతను శాస్త్రవేత్తలు బంధించారు. గడచిన మూడు దశాబ్దాలుగా చిత్రకారులు ఊహించి వేస్తున్న కృష్ణబిలం చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఉంది.

బ్లాక్ హోల్ ఫోటో తీసిన తరువాత, బ్రసెల్, షాంఘై, టోక్యో, వాషింగ్టన్, శాంటియాగో, తైపాల్లో శాస్త్రవేత్తలు ఏకకాలంలో మీడియా ముందుకు వచ్చి ఈ ఘనతను వివరించడం గమనార్హం. ఎం 87 అనే నక్షత్రమండలంలోనిది ఈ బ్లాక్ హోల్. ఆరు నెలల పాటు డేటా కోసం వేచి చూసి, 2017, డిసెంబర్ 23న సమాచారాన్ని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మ్యాంక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ శాస్త్రవేత్తలు కుదించగా, దీని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సైంటిస్టులు దీనిపై పరిశోధనలు సాగించి, తొలి చిత్రాన్ని సంపాదించగలిగారు.

Related posts