telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ముస్లింలు మమ్మల్ని నమ్మరు .. అందుకే టిక్కెట్లు ఇవ్వలేదు : బీజేపీ

ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు ప్రచారంలో భాగంగా నోరు జారుతుండటం సహజం అయిపోయింది. అయితే అది ఇలాంటి సమయంలో ఎంత పెద్ద రాద్దాంతంగా ప్రతిపక్షాలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కర్ణాటకు చెందిన సీనియర్ బీజేపీ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు భారతీయ జనతాపార్టీని నమ్మే పరిస్థితి లేదని, అందువల్ల వారికి టికెట్లను ఇవ్వడం లేదని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేఎస్ ఈశ్వరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు.

“కాంగ్రెస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోంది. వారు కూడా టికెట్లు ఇవ్వడం లేదు. మేము కర్ణాటకలో ముస్లింలకు టికెట్లు ఇవ్వలేదు. ఎందుకంటే వారికి మాపై నమ్మకం లేదు. మమ్మల్ని నమ్మి చూడండి… మేము టికెట్లు ఇస్తాం. మిగతావన్నీ ఇస్తాం” అని ఆయన అన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని కొప్పాల్ లో జరిగిన కురుబ వర్గం ప్రజలతో సమావేశమైన ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో 22 మంది ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలను ముస్లింలు హత్య చేశారని, హత్యాకాండకు పాల్పడిన ముస్లింలంతా కాంగ్రెస్ తోనే ఉన్నారని, మంచివారు మాత్రమే బీజేపీతో ఉన్నారని ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు.

Related posts