telugu navyamedia
news political trending VOTE

నాలుగు రాష్ట్రాలలో.. ఒక్కటే దక్కించుకున్న బీజేపీ… ఇవే సార్వత్రిక ఫలితాలు కూడా..

amitsha on party alliances

దేశంలో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ముందుగా ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఎన్నికలు; నేడు తెలంగాణ, రాజస్థాన్ లలో జరిగాయి. దీనితో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ నివేదికల ప్రకారం బీజేపీ నాలుగు రాష్ట్రాలలో ఒక్కదానినే దక్కించుకుంది. దీనిని బట్టే బీజేపీపై దేశవ్యాప్తంగా ఎంత వ్యతిరేకత ఉందొ అర్ధం అవుతుందని విశ్లేషకులు చెపుతున్నారు. ఇదే పరిణామం సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కూడా ఉండనుందని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ దేశంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అన్నది మాత్రం స్పష్టం కావాల్సి ఉంది.

దేశంలో బీజేపీ గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చాక తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాల వలన సామాన్యుడు తీవ్రంగా మదనపడిన విషయం తెలిసిందే. దీనితో ఆ పార్టీపై కేంద్రస్థాయిలోనే వ్యతిరేకత మొదలైంది. దానికి అర్జ్యం పోసినట్టుగా, రాఫెల్ కుంభకోణం తయారవడంతో ఇక బీజేపీ కోలుకోలేకపోయింది. అదే ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిబింభించిందని, సార్వత్రిక ఎన్నికలలో కూడా బీజేపీకి ఇదే ఫలితాలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు.

Related posts

ఫిబ్రవరి 4 నుండి ఫైనల్ షెడ్యూల్లో శుక్రా ప్రొడక్షన్ మూవీ

vimala p

నాలో నువ్వు…

vimala p

టీఆరెస్ కు 10 స్థానాలు కూడా రావు: పొన్నం

vimala p