telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కర్ణాటక తికమక : .. ఈవీఎం ప్రకారం బీజేపీ, బ్యాలెట్ ప్రకారం కాంగ్రెస్ గెలిచాయా .. ఇదేం విడ్డురం..

bjp won on evm and ballet says congress won

కర్ణాటకలో వారం రోజుల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కు లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే.రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌ సభ స్థానాలకు గానూ బీజేపీ 25 చోట్ల ఘన విజయం సాధించింది. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత…మే-29,2019న కర్ణాటకలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి విడివిడిగా పోటీ చేశాయి.ఎనిమిది నగర పాలక సంస్థలు, 33 పట్టణ మున్సిపాల్టీలకు,22 పట్టణ పంచాయితీలకు మొత్తంగా కలిపి 1,361 వార్డులకు నిర్వహించి ఎన్నికల ఫలితాలు శుక్రవారం(మే-31,2019) వెలువడ్డాయి.

మొత్తం 1,221 వార్డుల ఫలితాలు వెలువగడా కాంగ్రెస్‌ 509, బీజేపీ 366, జేడీఎస్‌ 174 వార్డుల్లో గెలుపొందారు. స్వతంత్రులు, ఇతరులు 167 స్థానాలను దక్కించుకున్నారు. ఫలితాలపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యా మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఓటర్ల నాడికి నిదర్శనమని అన్నారు. మున్సిపల్ ఫలితాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూ రావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. కర్ణాటక మున్సిపాల్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 శాతం సీట్లను గెలుపొందింది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.. లోక్‌ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ వెనుకబడటం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.. దీనిపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts