telugu navyamedia
news political trending

ప్రధాని మార్పు.. రాజ్ నాధ్ సింగ్ ముందంజలో…

bjp will win by changing pm candidate

గత ఎన్నికలలో దిగ్విజయం సాధించిన అనంతరం అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న మోడీ పై దేశవ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత ఉంది. దీనితో రాబోయే ఎన్నికలలో ఆయనే ప్రధానిగా ఉండటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.. అయితే పార్టీ గెలిచే అవకాశాలు ప్రధాని మార్పుతో ఉన్నాయన్న తాజా సర్వేలతో ఆ పార్టీ అధిష్టానం కూడా దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా నిర్వహించిన సర్వేలలో రాజ్ నాధ్ సింగ్ కు ప్రజలలో మంచి పేరు ఉందని తేలడంతో, రాబోయే ఎన్నికలలో ఆయనను ప్రధాని అభ్యర్థిగా పార్టీ తరుపున ప్రకటించి, ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నట్టు తెలుస్తుంది.

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అత్యుత్తమ పనితీరుతో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది రాజ్‌నాథ్‌కు జైకొట్టారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మంత్రి సుష్మా స్వరాజ్‌ మరో ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె ట్విటర్‌లో చురుగ్గా వ్యవహరిస్తారని, విదేశాల్లో భారతీయులు ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆమె వేగంగా స్పందిస్తారని సర్వేలో అత్యధిక మంది తెలిపారు.

Related posts

దీనివెనుక .. మతలబ్ ఏంటి.. ? యాదృచ్చికమా..!

vimala p

టీడీపీ ఓడిపోవడానికి పవనే కారణం: సుమన్

vimala p

నితిన్ తో .. రకుల్ .. పట్టాలెక్కనున్న చిత్రం…

vimala p