telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిషత్ ఎన్నికలను వాయిదా వేయండి: బీజేపీ లేఖ

తెలంగాణలో మే నెలలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ లేఖ రాశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ సరికాదని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరమే ఈ ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు. పార్టీ గుర్తులపైనే ఈ ఎన్నికలు జరగనున్నందున తామంతా ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

కానీ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోసం తాము దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నామని, దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక గ్రామ స్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయని, ఇవి ఒక్కోసారి గొడవలకు కూడా కారణమయ్యే ప్రమాదం ఉంటుందని, అలాంటప్పుడు పారామిలటరీ దళాలు రావాల్సి ఉంటుందని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల బిజీలో ఉన్న ఆ దళాలు ఎలా రాగలుగుతాయని ప్రశ్నించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఈ ఈ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని లక్ష్మణ్‌ లేఖలో పేర్కొన్నారు.

Related posts