telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్ లో చర్చ జరగాలి: పురంధేశ్వరి

daggubatipurandeswari

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులుండచ్చని సీఎం జగన్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం పై విభిన్న వాదనల నేపథ్యంలో బీజేపీ నేత పురంధేశ్వరి స్పందించారు. జీ ఎన్ రావు కమిటీ నివేదిక బహిర్గతం కాలేదంటూ.. దీనిపై కేబినెట్ లో చర్చ జరగాలని పేర్కొన్నారు. తమ పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణను ఆది నుంచి సమర్థిస్తుందని చెప్పారు.

అమరావతి ప్రాంత రైతులు రాజధానికోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాకే మూడు రాజధానులపై తన వైఖరిని వెల్లడిస్తుందన్నారు. టీడీపీ, వైసీపీలు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం రాజధాని కోసం నిధులు ఇచ్చినప్పటికీ.. చంద్రబాబు గ్రాఫిక్స్ కే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు.

Related posts