telugu navyamedia
andhra news political

ప్రధాని పర్యటనకు రాకపోవడం దారుణం: పురంధేశ్వరీ

BJP Purandeshwari Comments modi tour

ఏపీలో ప్రధాని పర్యటనకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు రాకపోవడం దారుణమని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరీ అన్నారు. మంగళవారం నాడు అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.

ఆర్థిక శాఖ నుండి ఆమోదం వచ్చిన తర్వాత కేంద్రం నుండి నిధులు వస్తాయన్నారు. దేశంలో పేదల కోసం మోడీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను కేంద్రం విడుదల చేసినట్టు ఆమె చెప్పారు. పెద్ద నోట్ల రద్దు చేయడంవల్ల వల్ల నల్లధనాన్ని నియంత్రించామని ఆమె వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు వల్ల మూడున్నర లక్షల డొల్ల కంపెనీలు మూతపడ్డాయని ఆమె చెప్పారు.

Related posts

ఇష్టంగా మూవీ రిలీజ్ పోస్టర్స్..

vimala p

జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు..రేపు విజయవాడలో ప్రకటన!

vimala p

బీహార్ పిల్లల మృతులు 54కు చేరాయి.. భయాందోళనలో స్థానికులు..

vimala p