telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీకి .. ప్రతిదీ రాజకీయమే.. అందుకే జిన్‌పింగ్ అక్కడ…

bjp politics on jinping tour

తమిళనాడులోని చెన్నై శివారులో ఉన్న చారిత్రక తీరప్రాంతం మహాబలిపురంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అక్టోబర్ 11న సమావేశం అవుతున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం మధ్యాహ్నం 2.10 గంటలకు జిన్‌పింగ్ చెన్నై చేరుకుంటారు. ఆ తర్వాత 4.55 కు మహాబలిపురంలో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇక్కడి తీరప్రాంత ఆలయాలు, అర్జునుడి తపస్సు శిల్పం, కృష్ణుడి వెన్న బంతి లాంటి పర్యటక ప్రదేశాలను వారు సందర్శిస్తారు. భారత ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబయిని కాదని, ఈ సమావేశానికి మహాబలిపురంను ఎంచుకోవడానికి కారణమేంటి? చెన్నై నుంచి ఈస్ట్‌ కోస్ట్ రోడ్డులో 62 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం ఉంది. పల్లవుల కాలం నాటి ఏకశిలా రథం, అరుదైన శిల్పాలు, గుహ ఆలయాలు లాంటి యునెస్కో వారసత్వ ప్రదేశాలున్న మహాబలిపురం, తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో భద్రతను క్రమంగా పెంచారు. 16.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ చిన్న పట్టణంలోని రోడ్లన్నిటికీ మరమ్మతులు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించారు.

ప్రధాన రహదారులన్నీ సీసీటీవీ నిఘా నీడలోకి తెచ్చారు. హోటళ్లు, లాడ్జీలు, రిసార్టుల్లో ఉంటున్న వారి వివరాలను స్థానిక పోలీసులు సేకరించారు. సముద్రంలో సర్ఫింగ్‌ను కూడా నియంత్రించారు. అక్టోబర్ 4 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి ప్రవేశించవద్దని అధికారులు సూచించారు. భద్రతను చూసేందుకు 500 మందికి పైగా పోలీసులను మోహరించారు. సెప్టెంబర్ 20 లోపే చైనా రాయబార కార్యాలయానికి చెందిన అధికారులు మహాబలిపురంను సందర్శించారని స్థానిక మీడియా తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం గత బుధవారం మహాబలిపురంను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
తీరాచూస్తే ఇది కూడా బీజేపీ రాజకీయం అని స్పష్టం అవుతుంది. తమిళనాడును ఆకర్షించాలని బీజేపీ అనుకుంటోంది. అందుకోసమే ఇప్పుడు ఈ సమావేశానికి తమిళనాడును ఎంచుకున్నారు. ప్రధానమంత్రి మోదీ ఎక్కడికి వెళ్లినా తమిళంలో మాట్లాడటం, తమిళంను పొగడటం కూడా దానికోసమే. దానికి మించి, ఈ సమావేశం తమిళనాడులో జరగడానికి మరే దౌత్యపరమైన కారణమూ లేదని విశ్లేషకులు అంటున్నారు.

Related posts