telugu navyamedia
రాజకీయ

ముగుస్తున్న కర్ణాటక రాజకీయం.. నేటి సభలో బీజేపీ వ్యూహం ఫలించేనా.. 

పలు నాటకీయ పరిణామాల మధ్య జేడీఎస్-కాంగ్రెస్ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతవరకు బాగానే ఉన్నా కూడా ఈ సంకీర్ణం లో మొదటి నుండి ఉన్న లుకలుకలతో ప్రభుత్వానికి దినదినగండం గానే ఉంది. ఇది బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత చూస్తున్నా కూడా, కర్ణాటకలో ఇలా నీచరాజకీయాలకు పాల్పడుతూనే మరో రాష్ట్రాన్ని తన అధికారంలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తుంది. సరిగ్గా శాసనసభ సమావేశాల సందర్భంగా బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధం అవుతుంది. 
శాసనసభకు హాజరుగాని శాసనసభ్యుల సంఖ్య ఒక్క రోజులో 20కి పెరగడంతో ఈ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందేమో నన్న కలకలం ఆ రెండు పార్టీల్లో నెలకొన్నాయి. ఒక జేడీఎస్‌ శాసన సభ్యునితో సహా 11 మంది శాసనసభ్యులు ముంబై లో విడిది వేసినట్లు తెలిసింది. ఇదే అదనుగా ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకునే దిశలో కుమారస్వామి నేటి (శుక్రవారం) మధ్యాహ్నం ప్రవేశ పెట్టాల్సిన రాష్ట్ర బడ్జెట్‌ ను అడ్డుకోవాలని బీజేపీ భావిస్తోంది. 
ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని బీజేపీ గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలిసి, 11మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదని ఫిర్యాదు చేయనుంది. గవర్నర్‌ గనుక జోక్యం చేసుకుంటే బడ్జెట్‌ సమావేశాలు ఆగిపోతాయేమొనన్న ఆందోళన కూడా సంకీర్ణ ప్రభుత్వం కలకలం సృహ్టిస్తుంది. విప్‌ జారీ చేసినా శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే (బుధవారం) 9 మంది శాసనసభ్యులు హాజరు కాలేదు. నిన్న గురువారం శాసనసభ వారి సంఖ్య 20 కి దాటడంతో కాంగ్రెస్‌ నేతల గుండెల్లో రాయి పడింది.

Related posts