telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వైసీపీ నేతలకు .. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ … ఆఫర్ ఇచ్చిన అమిత్ షా..

ycp party

ఏపీలో ఘనవిజయం సాధించిన వైసిపి ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లలో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు బీజేపీ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు సమాచారం. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్ఆర్‌సీపీకి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై వైఎస్ఆర్‌సీపీ తన అభిప్రాయాన్ని బీజేపీకి చెప్పాల్సి ఉంది. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలు కేటాయించడం ఆనవాయితీ. గత లోక్‌సభలో ఈ పదవిని అన్నాడిఎంకెకు కేటాయించారు. అన్నాడీఎంకెకు చెందిన తంబిదురై లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

ముందుగా డిప్యూడీ స్పీకర్ పదవిని తమిళనాడులో డీఎంకే భారీగా లోక్‌సభ సీట్లు సాధించడంతో ఆ పార్టీకి చెందిన తూత్తకుడి ఎంపీ కనిమొళికి ఇవ్వాలని అనుకున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న డీఎంకే ఆ పదవిని తీసుకునేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. అమిత్ షా కొద్ది రోజుల క్రితం ఎన్డీయేలో చేరాలని జగన్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే హోదా విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో జగన్ ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. మరోసారి వైసీపీ ఆకర్షించే క్రమంలో వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలనుకొంటున్నట్టుగా బీజేపీ నాయకత్వం నుంచి వైసీపీ అధిష్టానానికి సమాచారం అందింది. దీనిపై ఇంకా వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

వైసీపీ కూడా ఈ విషయంలో తర్జనభర్జనలు పడుతున్నట్టే తెలుస్తుంది. ఒకపక్క ఏపీకి హోదా, ఇతరత్రా అభివృద్ధి నిధుల విషయంలో కేంద్రం మరింత స్పష్టత ఇవ్వాలని వైసీపీ కోరుకుంటోంది. ఈ టైంలో వాళ్ల నుంచి ఎలాంటి హామీలు లేకుండా వాళ్లు ఇచ్చిన పదవులు తీసుకుంటే రేపు ఏపీలో విపక్షాలతో పాటు ప్రజల నుంచి బీజేపీతో అంటకాగుతున్నారు ? అన్న విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఈ విషయంలో జగన్ ఆచితూచి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ పదవి స్వీకరించాల్సి వస్తే ఎస్సీ, ఎస్టీ ఎంపీల్లో ఎవరో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా తో పాటుగా ఈ పదవి ఇస్తే, వైసీపీ కి తిరుగుండదు అంటున్నారు విశ్లేషకులు.

Related posts