telugu navyamedia
క్రీడలు వార్తలు

కోవిడ్ పేషేంట్ ను ఎలా అరెస్ట్ చేస్తారు : బండి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… అరాచక రాజ్యంలో ఉన్నామా? అరెస్టులు చేయడం, నెలల తరబడి జైల్లో పెట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నాడు. గిరిజనుల్ని, గిరిజనుల తరపున మాట్లాడుతున్న వాళ్లని కేసీఆర్ అణిచివేయాలని చూస్తున్నాడు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో కూడా గిరిజనులకు మద్దతుగా వెళ్లన బీజేపీవాళ్లను నెలల తరబడి జైల్లో పెట్టారు. కానీ ఈ అరెస్టులకు బీజేపీ భయపడదు… పోడు భూముల సమస్య పరిష్కరించేదాకా మేము పోరాడుతునే ఉంటా? పోడు భూముల సమస్య పరిష్కరిస్తా అంటూ ఆరున్నరేళ్లుగా కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నాడు. పోడు సమస్యపైనా, గిరిజనుల సమస్యపైనా పోరాటం చేసేవాళ్లను జైల్లో  పెట్టడమే కేసీఆర్ చూపిస్తున్న పరిష్కారమా ఎంత మందిని అరెస్టు చేస్తారా నేనూ చూస్తా. కోవిడ్ పేషేంట్ అయిన హరీష్ బాబును జైల్లో పెడుతున్నారు. ఆయన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే తర్వాత జరిగే పరిణామాలకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. చూడాలి మరి దీని పై తెరాస ఎలా స్పందిస్తుంది అనేది.

Related posts