telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మంత్రి హరీష్‌ రావు పై బండి ఫైర్…

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… మంత్రి హరీష్‌రావు అగ్గిపెట్టె కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారని కామెంట్ చేశారు.. తెలంగాణ ఉద్యమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీష్‌రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో విచారణ జరిపించాలన్నారు. శ్రీకాంతచారికి దొరికిన అగ్గిపెట్టే.. హరీష్‌రావుకు దొరకదా? అని ప్రశ్నించారు. హరీష్‌రావు అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అని ఫైర్ అయిన బండి సంజయ్.. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు. ఇక, శాసనసభలో లేని వ్యక్తి గురించి విమర్శలు చేయకూడాదని సీనియర్ గా చెప్పుకుంటున్న మంత్రి హరీష్‌రావుకు తెలియదా? అని ప్రశ్నించారు బండి సంజయ్.. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్న ఆయన.. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజక్టులను అడ్డుకోవాలని మాత్రమే తాను లేఖ రాశానన్నారు.. సీఎం కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిన అంశాన్ని వదలబోనని ప్రకటించిన సంజయ్.. లోక్‌సభ స్పీకర్ కోవిడ్ నుంచి కోలుకున్న వెంటనే కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై హరీష్ రావు ఏ విధంగా సమాధానం ఇస్తాడు అనేది చూడాలి మరి.

Related posts