telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ వర్గం ఓట్ల కోసమే కేసీఆర్‌ శివాజీ జయంతి ఉత్సవాలు జరపటంలేదు…

ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా బోరబండలో ఇటీవల పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించిన శివాజీ విగ్రహం ప్రాంతంలో శివాజీ చిత్ర పట్టాన్ని పెట్టి పూలమాలలు వేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అక్కడ బండి మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బండి సంజయ్.. ఖాసీం రజ్వి వారసుల రాక్షస పాలన తెలంగాణ సాగుతోందని విమర్శించిన ఆయన.. ఏ పార్టీవారు అయినా ఒక చేతిలో కాషాయ జెండా పెట్టుకోవాల్సిందే అన్నారు.. బాబర్, అక్బర్ వారసులకు ఇక్కడ స్థానం లేదని.. హిందువులందరూ ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. ఇక, తాను నిఖార్సైన హిందువునని చెప్పుకొనే సీఎం కేసీఆర్.. శివాజీ మహరాజ్ జయంతిని ఎందుకు జరపలేదంటూ ఫైర్ అయ్యారు. ఒక వర్గం ఓట్ల కోసమే ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు జరపటంలేదని కేసీఆర్‌పై మండిపడ్డారు.. మా ప్రభుత్వం వచ్చాక గ్రామ గ్రామాన శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బోరబండలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయటం మాకు పెద్ద సమస్య కాదు.. కానీ, శివాజీ జయంతి ఉత్సవాలను అడ్డుకోవటం సిగ్గుచేటు అన్నారు.. గ్రేటర్ లో హిందువులు చెంప దెబ్బ కొట్టినా పాలకులకు సిగ్గురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. హిందువుల దేవుళ్ళను అవమానించిన ఎంఐఎంకు కొమ్ము కాస్తోంది అంటూ ఫైర్ అయ్యారు.

Related posts