telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలం: బీజేపీ ఎంపీ అరవింద్

aravind bjp mp

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ మరోసారి విమర్శలు గుప్పించారు. యురియా కొరతపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యూరియాను రైతులకు పంపిణీ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాలిక లోపంవల్ల యూరియా కొరత ఏర్పడిందన్నారు.

రాష్ట్రానికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ యూరియా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. నిజామాబాద్‌లో కవితను ఓడించిన రైతులకు ప్రభుత్వం ఈ రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందన్నారు. ఈ జిల్లాకు కేటాయించిన యూరియాను పక్క జిల్లాలకు పంపారని, దీనిపై రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్‌కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని అరవింద్ విమర్శించారు.

Related posts