telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఓయూ ఆర్ట్స్ కాలేజికి బీజేపీ ఎమ్మెల్సీ…

తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వారి ఆత్మ ఘోషిస్తోంది అని బీజేపీ ఎమ్మెల్సీ రామ చందర్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో లో ఆర్ట్స్ కాలేజికి ప్రత్యేక స్థానం ఉంది. టీఎస్పీఎస్సీ ద్వారా కేవలం 32 వేల పోస్ట్ లే భర్తీ అయ్యాయి. యూనివర్సిటీ లలో ప్రొఫేసర్ లను నియమించడంలేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బ్రస్టు పట్టించి ప్రైవేటు యూనివర్సిటీ లకు అనుమతులు ఇచ్చారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాలేదు. పీఆర్సీ రిపోర్ట్ అమలు చేయడం లేదు. లక్షా తొంబై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ భృతి కోసం జీవితకాలం ఎదురు చూడాలా అని ప్రశ్నించారు ఆయన. ఓయూలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనియ్యలేదు. టీఆర్ఎస్ సర్కార్ చేసేది శూన్యం. అమరుల స్థూపం వద్ద కూడా మాట్లేడేందుకు సిద్దం గా ఉన్నాం. ఉద్యొగాలపై చర్చకు కేటీఆర్ ఇక్కడికి రాలేదు.. ఆయన ఓడిపోయారు. కేటీఆర్ సమాధానం చెప్తే పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్పా. కేంద్రం ఏమి చేసిందో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాము..డేటా తోనే వచ్చాను అన్నారు. అయితే దీని పై కేటీఆర్ ఏ విధంగా శాపమధనం చెపేడు అనేది చూడాలి.

Related posts