telugu navyamedia
news political trending

బీజేపీ నాయకుల హెచ్చరిక : ‘హిందూ మహిళలపై చేయివేస్తే నరికేయాలి..’

bjp leader warning on hindu women

రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ అధికారం చేతులలో ఉంది కదా అని నోటికి వచ్చింది మాట్లాడితే అది అధికారమదం అనే అంటారు విన్నవారు ఎవరైనా. తాజాగా అలాంటి సందర్భమే ఒకటి చోటుచేసుకుంది. “హిందూ మహిళలపై చేయి వేసిన వారి చేతులు నరికేయాలి” అని కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఆయన వ్యాఖ్యల తరువాత, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత తెహసీన్‌ పూనావాలా, తన భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “హిందూ మహిళపై చేయి వేసాను. ఏం చేస్తావో చేసుకో” అని వ్యాఖ్యానించారు. తెహసీన్ పూనావాలా ఓ హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. ఆయన తన భార్యతో దిగిన చిత్రాన్ని పోస్టు చేస్తూ, హెగ్డే వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.

ఇదిలావుండగా, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావు, ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ముస్లిం మహిళ వెనుక పరిగెత్తిన వ్యక్తిగా గుండూరావును హెగ్డే అభివర్ణించడం కూడా దుమారాన్ని రేపుతోంది. దీనిపై గుండూరావు భార్య తబస్సుమ్‌ స్పందిస్తూ, తాను రాజకీయాల్లోలేని సాధారణ మహిళనని, ఒక వివాహిత మహిళ చీర వెనుక దాక్కొన్న హెగ్డే, రాజకీయాలు చేస్తున్నారని, దీన్ని ఆపివేయాలని అన్నారు.

Related posts

రాష్ట్రపతిభవన్ లో ప్రముఖుల సందడి

vimala p

హైదరాబాద్ : స్కీమ్ కింద.. గిరిజనులకు ..ప్రముఖ విద్య సంస్థలలో ప్రవేశాలు..

vimala p

ఇదే తెలంగాణ.. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ .. రేపటి నుండే పాఠశాలలు ..

vimala p