ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు వార్తలు

టీడీపీ తెలుగు దోపిడి పార్టీగా మారిపోయింది: రాంమాధవ్

BJP Leader Rammadav comments

టీడీపీ తెలుగు దోపిడి పార్టీగా మారిపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్ష విజయవాడలో రాంమాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల పట్ల టీడీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడటానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆయన ఆరోపించారు.

అగ్రిగోల్డ్ ఆస్తులను కొడనానికి ముందుకు వచ్చిన ఎస్ఎల్ గ్రూపును ప్రభుత్వం వెనక్కి పంపిందని తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ లేకపోతే టీడీపీ గల్లంతయ్యేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉందని అన్నారు. ప్రభుత్వానికి జవాబుదాదీతనం ఉండాలని హితవు పలికారు. టీడీపీ నేతలు నీచమైన భాష మాట్లాడుతున్నారని రాంమాధవ్ వ్యాఖ్యానించారు.

Related posts

ఆ టీవీ చానళ్లను నిషేధించాలి..రేవంత్‌రెడ్డి ఫిర్యాదు

madhu

విజయ్ తో మరో సారి రొమాన్స్ చేయనున్న ఇద్దరు ముద్దుగుమ్మలు

jithu j

కర్ణాటకలో ఎన్నికల హోరు…

admin

Leave a Comment