telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీపై బీజేపీ నేతల .. సెటైర్లు.. రెండూ పార్టీలు గల్లంతు..

బీజేపీ పార్టీ ఏపీపై కన్ను వేసిన విషయం తెలిసిందే. దీనితో ఆ రాష్ట్రంలో పార్టీల నేతలను బీజేపీ ఆకర్ష్ పథకం కింద పార్టీలోకి ఆహ్వానిస్తుంది. తాజాగా, ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరు బీజేపీలో చేరబోతున్నారో ఇప్పుడే చెబితే… సస్పెన్స్ ఉండదని అన్నారు. రాజకీయ పార్టీలకు మిత్రపక్షం, శత్రుపక్షం ఉండదని అన్నారు. బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో సభ్యుల తీరు దారుణంగా ఉందని మాణిక్యాలరావు విమర్శించారు. టీడీపీ హయాంలో నడిచిన విధంగానే సభ ఇప్పుడు కూడా నడుస్తోందని అన్నారు. అప్పుడు, ఇప్పుడు వ్యక్తిగత దూషణలతోనే సభ నడుస్తోందని చెప్పారు.

చట్ట సభల్లో అభ్యంతరకరమైన భాషను వాడటం మంచిది కాదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకపోయినా… రాష్ట్రానికి అన్ని ప్రయోజనాలు వస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని, ఇప్పుడు ఆ పార్టీతోనే చంద్రబాబు కలిశారని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు, నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశం గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. 2019లో అధికారంలోకి వస్తాననే భ్రమతో అడ్డగోలుగా అవినీతి చేశారని, పోలవరం అథారిటీని కూడా పని చేయనివ్వలేదని ఆరోపించారు.

Related posts