telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అరే లుచ్చా.. లఫంగి ఫెలోస్… వీధిలోకి వెళ్లి మొరగండి… నా ఫేస్ బుక్‌ స్ట్రీట్ కాదు… మాధవీలత ఫైర్

Madhavilatha

సినీనటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత ఒక బ్రెన్ ట్యూమర్ పేషెంట్‌కి ఒక నెల మందులు సాయం చేయండంటూ ఫేస్ బుక్‌లో మందుల చీటీ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్లు నువ్వేం చేస్తున్నావ్? నువ్వే సాయం చేయొచ్చుగా అంటూ ఆమెపై కామెంట్స్ చేయడంతో ఫైర్ అవుతూ వీడియో వదిలింది మాధవీలత. ఈ వీడియోలో మాధవీలత మాట్లాడుతూ.. “నేను ఈ పోస్ట్ పెట్టేముందే అనుకున్నా.. దీనిపై సొల్లు కామెంట్స్ పెట్టే వీధి కుక్కలకంటే నీఛమైన వెధవలు తయారౌతారని.. అనుకున్నట్టుగానే చేశారు. వచ్చినవి 26 కామెంట్లు అయితే అందులో 20కి పైగా కామెంట్లు నీఛమైనవే. నువ్వేం పీకుతున్నావ్.. నువ్ కొనిపెట్టొచ్చుకదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అరే లుచ్చా.. లఫంగి ఫెలోస్.. నేను కొనిపెట్టేదే అయితే ఫేస్ బుక్‌లో పోస్ట్ ఎందుకు పెడతా.. మీ బాబుగారి, తాతగారి ఆస్తి నాకు రాసిచ్చారా? నాపై బంగారాలు దిగేశారా? సాయం చేయాలని మీరు నాకు చెప్పాల్సిన పనిలేదు.. నాకు చేయాలనిపిస్తే చేస్తా. మొన్న లాక్ డౌన్‌లో ఫుడ్ కోసం డొనేషన్లు కావాలంటే నాకు వచ్చింది 17 వేలు మాత్రమే. ఖర్చు అయ్యింది రూ.30 వేలు. వాటితో పాటు చాలా చేశాం. వాటికి ఎక్స్ ట్రా మరో రూ. 20 వేలు అయ్యాయి. ఇవన్నీ ఎవరు ఇస్తారు. నా ఫౌండేషన్‌ని డోనర్స్ ఎవరూ లేరు. ఫేస్ బుక్‌లో ఉన్న నిజమైన ఫాలోవర్స్ మాత్రమే డొనేట్ చేస్తున్నారు. నేను బ్రెయిన్ ట్యూమర్ అబ్బాయికి సాయం చేయడని మందుల చీటీ పెట్టి ఫోన్ నంబర్ కూడా ఇచ్చా. ఆ అబ్బాయికి ఫోన్ చేసి నీకు బ్రెయిన్ ట్యూమరా అని ఎదవ సొల్లు పెట్టొద్దు. ఎందుకంటే ఆ జబ్బు మీకు వస్తే నొప్పి తెలుస్తోంది. సాయం చేయలేకతోనే నోరూ మూసుకుని ఉండండి. ఎందుకు మీకంత గోక్కునే జబ్బు. సాయం చేయలేనోడు కామెంట్లు ఎందుకు పెడుతున్నారు. ఇలాంటి వాళ్లు వీధి కుక్కలకంటే నీఛమైన వాళ్లు. చైనా డొక్కు ఫోన్లు కొనుక్కుని ఫేస్ బుక్ ఇన్ స్టాల్ చేసుకుని పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. రూ. 200 కూడా డొనేట్ చేయలేని నీ బతుక్కి నీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఎందుకు. నాకు డబ్బులు ఇచ్చేవాళ్లు ప్రశ్నలు వేయడం లేదు.. రూపాయి పెట్టని మీరెవ్వర్రా నన్ను అడగడానికి? చేస్తే మూసుకుని సాయం చేయండి. దీనిపై కూడా కామెంట్లు చేస్తారు.. మీరు కోప్పడకూడదు అదీ ఇదీ అని. మీరు ఎవర్రా చెప్పడానికి. ఖచ్చితంగా తిడతా.. మాట్లాడతా. పనికి మాలిన కామెంట్లు వాళ్లు నా ఫేస్ బుక్‌లో ఉంటే ఎంత? పోతే ఎంత? మర్యాదగా నా ఫేస్ బుక్ నుంచి దొబ్బేయండి. ఆ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్‌కి ఒక నెల మందులు కొనాలంటే రూ. 25 వేలు అవుతుంది. అంత ఖర్చపెట్టలేని స్థితిలో నా ఫౌండేషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మీకు మంచి మనసు ఉంటే మందులు కొనండి. పిచ్చి కుక్కల్లా మొరిగే వాళ్లు వీధిలోకి వెళ్లి మొరగండి. నా ఫేస్ బుక్‌ స్ట్రీట్ కాదు మొరగడానికి” అంటూ నోటికొచ్చినట్లుగా నెటిజన్లపై ఫైర్ అయ్యింది మాధవీలత.

Related posts