telugu navyamedia
news political Telangana

టీఆర్ఎస్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు: బీజేపీ చీఫ్ లక్ష్మణ్

laxman kasetty

తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ తెలంగాణ చీఫ్ డాక్టర్ కె.లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. సోమవారం నిజామాబాద్‌లో ఆ పార్టీ నేతలు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంఐఎంతో చేతులు కలిపినందుకు టీఆర్ఎస్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు.తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం వెనక 30 ఏళ్ల కృషి ఉందన్నారు.

నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. అయినప్పటి ప్రజలు బీజేపీకే ఓటు వేసి గెలిపించారని అన్నారు. పసుపు, ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత ఆమె చేతులెత్తేశారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓట్ల లెక్కింపు .. ఇలా.. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం, వీవీప్యాట్‌…

vimala p

శిల్పాశెట్టి లా .. అందరు ఉండాలి.. : శివరాజ్ సింగ్ చౌహాన్

vimala p

బాలీవుడ్ సీనియర్ నటి విద్యాసిన్హా కన్నుమూత

vimala p