telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి : ఏపీ బీజేపీ

రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి లాంటి వారు ఆ పదవులకు అనర్హులని… విజయసాయు రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ హోదాలో ఉండే వ్యక్తులపై వైసీపీ నాయకులు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పైన విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పకుండా, చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పడం అంగీకారం కాదని… తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. “రావాలి జగన్ .. కావాలి జగన్” అన్న ఏపి ప్రజలు, జగన్ పాలన మాకు వద్దని ఇప్పుడు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పంచాయితీ ఎన్నికలలో బెదిరింపులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో పంచాయతీలకు ఎన్నికలు జరగడం లేదు, ఎంపికలు మాత్రమే జరుగుతున్నాయని… ఆటవిక రాజ్యం ఏపీలో నడుస్తుందని మండిపడ్డారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని… దాడులను ప్రశ్నించిన వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నిత్యం బూతులు తిడుతూ, బూతుల శాఖ మంత్రిగా మారిపోయారు. ఆయనపై రాష్ట్ర సీఎం చర్యలు తీసుకోవాలి.

Related posts