telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మోదీ 100 రోజుల పాలనలో కీలక నిర్ణయాలు: కిషన్ రెడ్డి

Kishan Reddy

ప్రధాని మోదీ 100 రోజుల పాలనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గుంటూరులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు మోదీ కృషి చేశారని ప్రశంసించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 3 నెలల్లోనే 30 బిల్లులను ఆమోదించిదని తెలిపారు.

సంస్కరణల్లో వేగం పెరిగిందనీ సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. మోదీ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ అదనంగా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాదిలో 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడనుందని చెప్పారు. ఒకే దేశం-ఒకే పవర్ గ్రిడ్ విధానంతో ముందుకెళుతున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts