telugu navyamedia
news political Telangana

ఈ నెల 18న 20 వేల మంది బీజేపీలో చేరుతారు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

ఈ నెల 18న బీజేపీలో 20,000 మంది చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు తామంతా సైనికుల్లా పనిచేస్తున్నామని తెలిపారు. తమతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని లక్ష్మణ్ వెల్లడించారు. కాంగ్రెస్ చేసిన తప్పులను బీజేపీ సరిదిద్దుతోందన్నారు.

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులు విడుదల చేసినా, తెలంగాణ సర్కారు ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. మజ్లిస్ పార్టీని చంకలో పెట్టుకున్న సీఎం కేసీఆర్, మరోపక్క మతోన్మాదం అంటూ మాట్లాడితే బాధేస్తోందని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ చెబుతున్న శ్రీరంగనీతులు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు.

 

Related posts

ఈ నెల 20 తరువాత పాక్షికంగా నిబంధనల సడలింపు: కేరళ సీఎం

vimala p

ఈసెట్‌ ఫలితాల్లో గందరగోళం.. విద్యార్తులందరికి సున్న మార్కులు!

vimala p

ఢిల్లీ వెళ్లి చీవాట్లు తినడం జగన్ కు ఆనవాయితీ: యనమల

vimala p