telugu navyamedia
news political trending

జార్ఖండ్‌ : … బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా .. సిద్ధం..

bjp first list of candidates of jharkhand

ఆదివారం బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 52 మంది పేర్లతో తొలి జాబితాను ప్రకటించింది. జంషెడ్‌పుర్‌ తూర్పు నుంచి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ గిలువా చక్రంధర్‌పుర్‌ నుంచి పోటీ చేస్తారని పార్టీ జనరల్‌ సెక్రటరీ అరుణ్‌ సింగ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా పాల్గొన్నారు. ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్‌ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ రామేశ్వరం ఓరం ఉన్నారు. లోహర్‌దంగా నియోజక వర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు మొత్తం ఐదు దశల్లో జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడతకు నవంబర్‌ 13తో నామినేషన్‌ ప్రక్రియ ముగియనుంది. ఈ ఎన్నికల్లో కాం‍గ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎమ్‌ఎమ్‌), రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌ఎల్డీ) కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి సీఎం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ప్రకటించారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో జేఎమ్‌ఎమ్‌ 43, కాంగ్రెస్‌ 31, ఆర్జేడీ 7 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 23న వెల్లడవుతాయి.

Related posts

అభ్యర్థులకు ఈ సారి కొత్త రూల్స్ పెట్టిన ఎన్నికల సంఘం

ashok

సద్దుల బతుకమ్మ ఎఫెక్ట్.. చామంతి పువ్వులు కిలో రూ.600

vimala p

మహేష్ బాబుకు కమల్ హాసన్ ధన్యవాదాలు

vimala p