telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. ఇంకా సరిలేని.. ఓటర్ల జాబితా.. టాలీవుడ్ నటుడికి .. అక్కడ ఓటుహక్కు..

రాష్ట్రంలో ఇంకా ఓటరు జాబితాపై ఆయా పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. తాజాగా, నారాయణఖేడ్ పట్టణ ఓటర్ల లిస్టులో టాలీవుడ్ యువనటుడు మంచు మనోజ్ పేరు ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదో ఉదాహరణ మాత్రమే, ఇలాంటివి ఎన్నో.. దీనితో తప్పులు తడకలుగానే ఓటరు జాబితా ఉన్నట్టు తెలుస్తుంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో మంచు మనోజ్ పేరిట ఓటు హక్కు ఉండడంపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయగా, జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు.

ఉన్నదే తప్పుడు ఓటు, కానీ అదే నిజమైనదిగా ఎంతో వివరంగా ఉండటం విశేషం… అంటే, మంచు మనోజ్ కు సంబంధించిన అన్ని వివరాలు పేర్కొన్నారు. మంచు మనోజ్ ఫొటోతో పాటు, తండ్రి పేరు మంచు మోహన్ బాబు అని, రెండో వార్డులో 2-25 ఇంటి నెంబర్ అని పేర్కొన్నారు. ఎక్కడో హైదరాబాద్ లో ఉండే మంచు మనోజ్ కు నారాయణఖేడ్ లో ఓటు ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను సరిగా పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related posts