telugu navyamedia
news political

మమతా ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయండి: బీజేపీ డిమాండ్

BJP compliant EC West Bengal

ఆరో విడత ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. కోల్‌కతాలో నిన్న బీజేపీ చీఫ్‌ అమిత్‌షా రోడ్డు షో సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లురువ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా 19వ శతాబ్దపు సామాజిక కార్యకర్త విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

దాడులు హింసాత్మకంగా మారడంతో పలుచోట్ల పోలీసులు జోక్యం చేసుకుని అల్లరి మూకలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని బీజేపీ ఈ రోజు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, మమతా బెనర్జీ సర్కారును భర్తరఫ్‌ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Related posts

తెలంగాణాలో .. 67/119 అభ్యర్థులకు నేరచరిత్రలు…

vimala p

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్ లేఖ

vimala p

ఓటుకు నోటు కేసు : స్టీఫెన్ సన్ కు సెబాస్టియన్ రూ.5 కోట్లు ఆశ చూపిన వీడియో.. బహిర్గతం .. !

vimala p