telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిపాలించడం చేతకాకే… బీజేపీపై టీఆర్ఎస్ విమర్శలు: బాబు మోహన్

reasons behind babumohan into bjp

పరిపాలించడం చేతకాకే… బీజేపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేత, సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతోందని అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన వస్తోందని చెప్పారు. సభ్యత్వ నమోదుపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని చెప్పారు.

క్షేత్ర స్థాయిలో బీజేపీ ఎంత బలంగా ఉందో కొంత కాలం ఆగితే టీఆర్ఎస్ కు అర్థమవుతుందని చెప్పారు. కూల్చడం తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరేమీ తెలియదని అన్నారు. రాజకీయాల్లో అవుట్ డేట్ కావడం ఉండదని, ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్, కేటీఆర్ ఔట్ డేట్ అవుతారా? అని ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ ఆదేశాల మేరకు కష్టపడి పని చేస్తానని పేర్కొన్నారు.

Related posts