telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుపతి ఎన్నికలో నామినేషన్ వేసిన వైసీపీ, బీజేపీ అభ్యర్ధులు…

ఏపీలో ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల వేడి ఉంది. అయితే ఈ ఎన్నికలో వైసీపీ ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న మద్దిల గురుమూర్తి నేడు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి   మేకపాటి గౌతమ్ రెడ్డి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆది మూలపు సురేష్, కొడాలి నాని, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ  స్వామి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లోక్ సభ పరిధిలోని ఎంఎల్ఏలు ఉన్నారు. మొదట నెల్లూరు నగరంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడి నుంచి చిత్తూరు,  నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వై యెస్ జగన్ అభిమానులు, డాక్టర్ మద్దిల గురుమూర్తి అనుచరులు వేలాదిమంది తో ర్యాలీ అట్టహాసంగా కలెక్టరేట్ వరకు సాగింది.  తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ కూడా నామినేషన్ దాఖలు చేశారు. రత్నప్రభ తో పాటు ఎంపి జీవీఎల్ నరసింహారావు,సీఎం రమేష్, కోలా ఆనంద్…మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు వచ్చారు. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలో ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది.

Related posts