telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

కాకరకాయతో .. ఊబకాయానికి చెక్.. పెట్టేయండి..

bitter gourd for controlling over weight

కాకరకాయ పేరు వింటేనే చాలామందికి నచ్చదు. కానీ చేదు కంటే కూడా కాకరకాయలో ఎక్కువ శాతం ఔషధ గుణాలున్నాయని చాలా మందికి తెలియదు. కాకరకాయలో ఫాస్ఫరస్ అధికమోతాదులో ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఈ కాకరకాయ వల్ల ఎన్నో సమస్యలు దరిచేరవు అని అంటున్నారు వైద్య నిపుణులు. డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

* కాకరకాయ రసంలో సహజ సిద్దంగా మంటను తగ్గించే గుణాలు ఎక్కువగా ఉండటంతో శరీరంలో చెడు క్రొవ్వుల స్థాయిలను తగ్గించడంలో కాకరకాయ మొదటి స్థానంలో ఉంది.

* గుండెపోటును, స్ట్రోక్ ప్రమాదాన్ని సైతం గణనీయంగా తగ్గించేస్తుంది. శరీరంలోని సోడియం అధికంగా గ్రహించడంతో పాటు, పొటాషియం కూడా అధికంగా ఉంటుంది.

* అలెర్జీలు నయం చేయడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా బాగా సహాయపడతాయి. కాకరకాయలో ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ తోపాటు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కూడా భారీగా ఉన్నాయి.

* విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో నిండి ఉండటం, ఈ ఫైబర్ ప్రేగు కదలికలను మెరుగుపరిచి కడుపు నిండిన అనుభూతికి లోనవడం ద్వారా అతిగా తినడాన్ని నిరోధించి తృప్తిని పెంచుతుంది.

* దీని రసంలో ఉండే విటమిన్లు, ఇతర ఖనిజాలు జీవక్రియల ప్రక్రియ వేగవంతం చేయడంలో దోహద పడి క్యాలరీలు, కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లలో తక్కువగా ఉంటుంది, వీటి తద్వారా బరువు తగ్గడంలో కాకరకాయ ఎంతో సహాయం చేస్తుంది.

దీనితో చాలా ఈజీగా బరువు తగ్గచ్చు. మొదట కాకరకయా కాస్త చేదుగా ఉన్న తర్వాత దాని లాభాలలానే అది కూడా తియ్యగా మారిపోతుంది. ఆలా మారుతుంది అని ఎక్కువా మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం వైద్యులు చెప్తున్నారు.

Related posts