telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“తుపాకీ రాముడు”గా బిత్తిరి స‌త్తి… టీజ‌ర్‌ విడుదల

Satti

బిత్తిరి స‌త్తి, ప్రియ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం “తుపాకీ రాముడు”. ర‌స‌మ‌యి ఫిలింస్ ప‌తాకంపై టి.ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను శుక్ర‌వారం క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ “సత్తితో నాకు చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. త‌ను స్ట్రెస్ బ‌స్ట‌ర్‌. త‌న వీడియోలు చూసి మా ఫ్యామిలీ సహా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. చాలా కొత్త విష‌యాల‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా చెప్పే స‌త్తి ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా మారారు. ఆయ‌న హీరోగా చేసిన ‘తుపాకీ రాముడు’ చిత్రాన్ని దిల్‌రాజుగారు ఈ నెల 25న విడుద‌ల చేస్తున్నారు. ర‌స‌మ‌యిగారు నిర్మించిన చిత్ర‌మిది. ఇందులో మ‌న ప‌ల్లెటూర్ల‌కి సంబంధించిన చాలా విష‌యాలున్నాయి. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌” అన్నారు.

ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాలకిష‌న్ మాట్లాడుతూ “చాలా రోజులుగా మ‌న సంస్కృతిని తెతియ‌జేసే సినిమాను తెర‌కెక్కించాల‌ని అనుకుంటుండ‌గా, మంచి క‌థ దొరికింది. అదే తుపాకీ రాముడు. ఈ సినిమాను తెర‌కెక్కించాం. విజ‌య్ దేవ‌ర‌కొండ మా టీజ‌ర్‌ను విడుద‌ల చేసినందుకు ఆయ‌న‌కు థ్యాంక్స్‌. అలాగే ఎన్నో మంచి చిత్రాల‌ను విడుద‌ల చేసిన పెద్ద నిర్మాత దిల్‌రాజు మా సినిమాను చూసి ఈ సినిమాను విడుదల చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఆయ‌న‌కు మా సంస్థ త‌ర‌పున పెద్ద థ్యాంక్స్‌” అన్నారు.

Related posts