telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీరెడ్డిపై బిత్తిరి సత్తి పంచ్

Satthi

బిత్తిరి స‌త్తి, ప్రియ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం “తుపాకీ రాముడు”. ర‌స‌మ‌యి ఫిలింస్ ప‌తాకంపై టి.ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్ ఈయన ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఫేమస్. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది. ఛానెల్ మారిన రోజు నుంచి ఇప్పుడు హీరోగా తుపాకి రాముడు సినిమా చేసేంతవరకు కూడా రోజూ మీడియాలో కనిపిస్తున్నాడు బిత్తిరి సత్తి. ఇక ఇప్పుడు శ్రీరెడ్డి పేరు చెప్పకుండా అదిరిపోయే పంచ్ వేసాడు బిత్తిరి సత్తి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చాడు బిత్తిరి. అందులో భాగంగానే ఒకప్పుడు తన కెరీర్ ఎలా మొదలైందనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. దాంతో పాటు కొందరు దర్శకులు, నిర్మాతలు తనను అవమానించారని, నీ మొహం అద్దంలో చూసుకోరా.. పెళ్లై ఇద్దరు పిల్లలయ్యారు అంటున్నావ్… ఇప్పుడు నీకెందుకురా సినిమాలు అంటూ వార్నింగులు కూడా ఇచ్చారని చెప్పాడు సత్తి. అయితే సక్సెస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు వాళ్ల గురించి మాట్లాడుకోవడం అనవసరం అని చెప్పాడు సత్తి. ఇంకో రెండు మూడేళ్లు కానీ అలాగే ఉండుంటే తాను కూడా మీడియా ముందుకొచ్చి నా జీవితం నాశనం అయిపోయింది. నన్ను వాడుకుని వదిలేసారని ఏడవాల్సి వచ్చేదంటూ సెటైర్లు వేసాడు. కాస్టింగ్ కౌచ్ మాదిరే తను డ్రింకింగ్ కౌచ్ అని చెప్పాడు బిత్తిరి. నాన్ను వాడుకుని వదిలేసారు.. ఛాన్సుల పేరుతో మోసం చేసారని శ్రీ రెడ్డి తెలుగులో ఉద్యమం మొదలుపెట్టింది. ఇప్పుడు దీనిపై సత్తి అదిరిపోయే పంచ్ వేసాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts