telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూయార్క్ వీధుల్లో ప్రియుడితో నయన్… పుట్టినరోజు సెలెబ్రేషన్స్

Nayan

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే మ‌తిభ్ర‌మించ‌క త‌ప్ప‌దు. ప‌లు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన ఈ అమ్మ‌డు హీరోల‌కి స‌మానంగా ఫాలోయింగ్ పెంచుకుంది. త్వ‌ర‌లో ద‌ర్భార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చంద్రముఖి సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పై మెరిసింది నయనతార. కాగా నయనతార నేటితో (సోమవారం) 35వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తన జన్మదినోత్సవ వేడుకలను జరుపుకునేందుకు నయనతార తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లింది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల విఘ్నేష్ పుట్టినరోజును నయన్ చెన్నైలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు నయన్ బర్త్‌డే కోసం ఆమెతో కలిసి విఘ్నేష్ కూడా న్యూయార్క్ వెళ్లాడు. అక్కడి వీధుల్లో కలిసి తిరుగుతూ తీయించుకున్న ఫొటోలను విఘ్నేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Related posts