telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

సినిమా హల్లో సీటు కింద ఇరుక్కున్న భర్త… భార్య ముందే…

VUE

బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో సినిమాకెళ్లిందా కుటుంబం. స్టార్‌సిటీ కాంప్లెక్స్‌లో సినిమా చూసిన తర్వాత తన పర్సు, కారు తాళం పోయినట్లు తెలిసింది 24 ఏళ్ల అతీక్ రఫీక్‌కు. ఎక్కడ పడిందా అని తన సీటు చుట్టుపక్కల వెదికాడు. అవి కనిపించకపోవడంతో సీటు కింద పడ్డాయేమోనని చూశాడు. అలా చూస్తుండగానే పైకి ఉండాల్సిన ఆ సీటు ఫుట్‌రెస్టు అనుకోకుండా కిందకు వాలింది. దాంతో అతను సీటు కింద ఇరుక్కుపోయాడు. అక్కడి నుంచి బయటపడలేక కేకలు వేస్తున్న భర్తను చూసి.. అతని భార్య కంగారుపడింది. సెక్యూరిటీని పిలిచి విషయం చెప్పగా.. వారు ఆ సీటుకు ఉన్న బోల్టులు విప్పి సీటును తొలగించారు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. సీటు కింద ఊపిరి తీసుకోవడానికి గాలి లేకపోవడంతో పాటు విపరీతమైన కంగారు వల్ల అతీక్‌కు హార్‌్్ఎటాక్ వచ్చింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వారం పాటు మృత్యువుతో పోరాడి చివరకు దానికి తలొగ్గాడు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల అతని మెదడుకు గట్టి షాక్ తగిలిందని అందువల్లే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. ఆ రోజు అసలు సినిమాకు వెళ్లకపోయి ఉన్నా బావుండేదంటూ కన్నీటిపర్యంతం అవుతోంది అతీక్ భార్య.

Related posts