telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన బర్డ్ ఫ్లూ…

అయితే గత ఏడాది నుండి కరోనాతో దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది. కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.  ఈ సమయంలో కొత్త స్ట్రెయిన్ కేసుల రాకతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యి.  అదే సమయంలో బర్డ్ ఫ్లూ వైరస్ కూడా భయపెడుతున్నది.  రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ వైరస్ బయటపడింది.  ఈ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పక్షులు మృతి చెందుతున్నాయి.  దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.  మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.  ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం తెలుగు రాష్ట్రాలను పట్టుకుంది.  తెనాలి సమీపంలో వందలాది పక్షులు మృతి చెందాయి.  పక్షులు మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి.  అయితే, ఇప్పటి వరకు పక్షులకు మాత్రమే బర్డ్ ఫ్లూ సోకడంతో పౌల్ట్రీ పరిశ్రమలు  పడుతున్నాయి.  కోళ్లకు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts