telugu navyamedia
రాజకీయ వార్తలు

కొత్త ఆర్మీ చీఫ్ గా మనోజ్ ముకుంద్ నరవానే!

army chief manoj kumar

భారత కొత్త సైన్యాధ్యక్షుడిగా జనరల్ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మూడేళ్ల పదవీకాలం నేటితో ముగియడంతో.. ఆయన నుంచి జనరల్ నరవానే బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు నరవానే ఆర్మీ వైస్ చీఫ్‌గా కొనసాగారు. కాగా జనరల్ రావత్‌ను భారత తొలి మహా దళాధిపతిగా నియమిస్తూ నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

37 ఏళ్ల తన ఇండియన్ ఆర్మీ కెరీర్‌లో జనరల్ నరవానే పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్ల తిప్పికొట్టేందుకు, శాంతిని నెలకొల్పేందుకు విస్తృతంగా కృషిచేశారు. 1980 జూన్‌లో సిక్ లైట్ ఇన్ఫాంటరీ రెజిమెంట్ 7వ బెటాలియన్‌లో ప్రవేశించడం ద్వారా జనరల్ నరవానే కెరీర్ మొదలైంది. ఇండియన్ ఆర్మీలో తీవ్ర సవాళ్ల మధ్య పనిచేసిన అనుభవం నరవానేకి ఉంది.

Related posts