telugu navyamedia
సినిమా వార్తలు

నగ్నంగా నటించడానికి మరో హీరోయిన్ రెడీ

Bindu-madhavi

దక్షిణాది హీరోయిన్లు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ తరం నటీమణులు అనుష్క, నయనతార, త్రిష, జ్యోతికలు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడానికి మక్కువ చూపుతున్నారు. ఇదే వరసలో తానూ సిద్ధమేనంటోంది బిందుమాధవి. వరుస విజయాలతో కోలీవుడ్‌లో నటిగా రాణిస్తున్న ఆమె బిగ్‌బాస్‌-1 గేమ్‌షోలో కూడా పాల్గొని అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బిందుమాధవి కృష్ణ హీరోగా నటించిన ‘కళుగు-2’లో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఆగస్టు 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథకు ప్రాముఖ్యత వుంటే అమలాపాల్‌లా తాను నటించేందుకు సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చింది. కథకు ప్రాముఖ్యత వుంటే నగ్నంగా నటించేందుకు తాను సిద్ధమంటోంది బిందుమాధవి. ఇటీవలే అమలాపాల్ కూడా “ఆడై” చిత్రంలో నగ్నంగా నటించి విమర్శలతో పాటు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు బిందు మాధవి కూడా నగ్నంగా నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొస్తుంది.

Related posts