telugu navyamedia
culture news

బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్ కన్నుమూత

William Gates

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్(94) అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ వెల్లడించారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీవితంలో తప్పకుండా జరగాల్సిన రోజు కోసం తామంతా మానసికంగా సిద్దమయ్యామని తెలిపారు.

తన తండ్రిని ఎంతగా మిస్ అవుతామో మాటల్లో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకున్న మేధస్సు, ఉదారత, గొప్ప భావాలతో తన తండ్రి ఎందరినో ప్రభావితం చేశారని బిల్ గేట్స్ చెప్పారు. తనపై కూడా ఆయన ప్రభావం ఎంతో ఉందని అన్నారు. అసలైన బిల్ గేట్స్ తన తండ్రేనని అన్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ లో కూడా ఆయన తండ్రి పాత్ర ఎంతో ఉందని బిల్స్ గేట్స్ తెలిపారు. విలియం గేట్స్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

Related posts

మహారాష్ట్రపై .. కబడ్డీ కామెంట్ చేసిన .. ఆనంద్ మహీంద్రా

vimala p

భారత్ చేతికి స్విస్ ఖాతాల జాబితా!

vimala p

ఎస్వీబీసీ .. భక్తి ఛానల్ కు .. నటుడు పృథ్వీరాజ్ చైర్మన్ ..

vimala p