telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బికినీ .. ఇది ఎయిర్ లైన్స్ పేరందడి .. బ్రహ్మాండమైన ఆఫర్లతో భారత్ లో…

bikini air lines in india with offers

బికినీ ఎయిర్‌లైన్స్ గా పేరుగాంచిన వియత్నాంకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ ఇండియా-వియత్నాం మధ్య ప్రత్యేక సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. డిసెంబరు ఆరో తేదీ నుంచి న్యూఢిల్లీ-హోచిమిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలు నడపనున్నట్టు తెలిపింది. అలాగే, హనోయి-ఢిల్లీ మార్గంలో డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని పేర్కొంది. ఈ సందర్భంగా వియత్ జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్ తన్‌సన్ మాట్లాడుతూ.. వ్యాపార విస్తరణ విషయంలో భారత్ తమకు మొదటి ప్రాధాన్య దేశమని పేర్కొన్నారు.

ఈ సంస్థ భారత్‌లోకి అడుగుపెడుతూనే బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘త్రీ గోల్డెన్ డేస్’ పేరుతో స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా 9 రూపాయలకే టికెట్లను విక్రయిస్తోంది. రెండు రోజుల క్రితం ఆఫర్ సేల్ ప్రారంభించగా నేటితో ఆఖరు. 2011లో సేవలు ప్రారంభించిన వియత్‌ జెట్ విమానయాన సంస్థల్లో ప్రత్యేకతను చాటుకుంది. ఆ సంస్థ విమానాల్లోని ఎయిర్‌ హెస్టెస్, సిబ్బంది బికినీల్లో సేవలందిస్తారు. దీంతో ఈ సంస్థకు బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరు స్థిరపడింది.

Related posts