telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

జమ్మూకశ్మీర్‌ : .. మరో రెండు పెళ్లిళ్లు.. అన్నదమ్ముల అరెస్ట్..

Arrest

బీహార్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు రాష్ట్రానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు యువకులు అరెస్టు అయ్యారు. బీహార్‌కు చెందిన పర్వేజ్, తాబ్రేజ్‌ ఇద్దరు అన్నదమ్ముళ్లు. వీరిద్దరూ జమ్మూకశ్మీర్‌ రాంబన్‌ జిల్లాలో పని చేసుకుంటున్నారు. అక్కడున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. పర్వేజ్‌, తాబ్రేజ్‌తో ప్రేమలో పడ్డారు. 370 ఆర్టికల్‌ రద్దు కావడంతో.. ఇటీవలే ఈ జంటలు ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాయి. అయితే పెళ్లి చేసుకున్న విషయం యువతుల నివాసంలో తెలియదు. పెళ్లి చేసుకున్న అనంతరం బీహార్‌ చేరుకుని జీవిస్తున్నారు.

విషయం తెలుసుకున్న అమ్మాయిల తల్లిదండ్రులు.. తమ కూతుళ్లను కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ;ఈ పిర్యాదు మేరకు మాత్రమే పోలీసులు బీహార్‌ చేరుకుని ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. మేమిద్దరం మనసుకు నచ్చిన అబ్బాయిలను పెళ్లి చేసుకున్నాం. కశ్మీర్‌ వెళ్లడానికి తమ ఇష్టం లేదు అని అమ్మాయిలు పోలీసులకు చెప్పారు. తాను, తన భర్య మేజర్లం కాబట్టి పెళ్లి చేసుకున్నాం. దీంట్లో తప్పేముందని పర్వేజ్‌ ప్రశ్నించారు. మొత్తానికి పర్వేజ్‌, తాబ్రేజ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారణ నిమిత్తం జమ్మూకశ్మీర్‌కు తరలించారు. ఆర్టికల్ 370 రద్దు కంటే ముందు.. ఒక కశ్మీరీ మహిళ భారతదేశంలోని ఇతర రాష్ట్రంలోని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మహిళ కశ్మీరీ పౌరసత్వం కోల్పోయేది. కానీ ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరి మహిళ ఆ పౌరసత్వాన్ని కోల్పోదు.

Related posts