telugu navyamedia
ఆరోగ్యం క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

100 కు చేరిన .. బీహార్ పిల్లల మరణాలు.. వడగాలులతో ..

bihar children deaths crossed 100

మొదడువాపు వ్యాధితో బీహార్ లో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 100దాటింది. రెండు వారాల వ్యవధిలోనే 100చిన్నారులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బీహార్ లోని ముజఫర్ పూర్ లో పరిస్థితులు దారుణంగా మారాయి.ముజఫర్ పూర్ లోని ఒక్క శ్రీకృష్ణ మెడికల్ కాలేజీలోనే 83మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో మృతి చెందారు.290కి పైగా చిన్నారులు ఈ హాస్పిటల్ లోని ఐసీయూలో అడ్మిట్ అయ్యారు.శ్రీకృష్ణా మెడికల్ కాలేజ్‌లో పరిస్థితి దారుణంగా మారింది. ఎటు చూసినా చిన్నారులు..ఇతర రోగులతో ఆస్పత్రి కిటకిటలాడిపోతుంది. చికిత్స పొందుతున్నవారు కానీ..మరణించిన వారికి కానీ మెదడువాపు వ్యాధి కారణం కాకపోవచ్చని చాలామందిలో షుగర్ లెవల్స్ పడిపోయి చనిపోతున్నారని కొందరు డాక్టర్లు చెబుతున్నారు.

20మందికి పైగా చిన్నారులు, కేజ్రీవాల్ హాస్పిటల్ లో చనిపోయారు. ఈ రెండు ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచామని, చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్‌ ఆరోగ్య శాఖ మంత్రి మంగల్‌ పాండే చెప్పారు. నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ లు ఇప్పటికే మజఫర్ పూర్ లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఆదివారం(జూన్-16,2019) వీరిని పరామర్శించేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్యమంత్రి ఎదుట కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లల మృతికి డాక్టర్ల నిర్లక్ష్యం కూడా కారణమే అని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది.

Related posts