telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

వరుడికి లవ్‌ ఎఫైర్‌ : పెళ్లికూతురి తల నరికి మరీ దారుణం

ప్రేమ వ్యవహరాల కారణంగా హత్యలు కూడా జరగడం కామన్‌ అయిపోయింది. పెళ్లి జరిగక ముందు ఉన్న ప్రేమ వ్యవహారం కారణంగా చాలా మంది యువతులు, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో నలంద జిల్లా ద్వారకా బిగాహా గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతికి నీర్‌పూర్‌ గ్రామానికి చెందిన ఆజాద్‌ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు సరస్వతి పూజా సమయంలో వధువు కుటుంబం వరుడి కుటుంబ సభ్యులకు సుమారు 4 లక్షల విలువైన వస్తువులను ఇచ్చారు. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే పెళ్లి కూతురును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి ఆమె తల నరికి కిరాతకంగా చంపేశారు. తల లేని యువతి మృతదేహాన్ని చూసి స్థానికులు హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యలు. తార్థారి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. యువతి మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. పెళ్లి కొడుకు లవ్‌ ఎఫైర్‌ కారణంగానే ఈ ఘటన జరిగిందని మృతిరాలి బంధువులు ఆరోపణలు చేశారు. ఆజాద్‌ గతంలోనే మరో యువతితో ప్రేమాయణం నడిపాడని.. ఆమె బంధువులే ఆ దారుణానికి పాల్పడ్డారని బోరున విలపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Related posts