telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పవర్ స్టార్” గురించి వర్మకు వార్నింగ్ ?

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన పార్టీ అధ్యక్షుడిగా గత ఎన్నికల్లో ఆయన వైఫల్యాన్ని కాస్త వెటకారంగా “పవర్ స్టార్”తో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులతో ఓ 30 నిమిషాల సినిమాను తీసేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను వర్మ ట్విట్టర్ ద్వారా వదిలారు. అయితే నిజానికి వర్మకు ఇప్పటికే పవన్ వర్గం నుంచి వార్నింగ్‌లు వెళ్లిపోయాయని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ సినిమాను ప్రకటించినప్పుడు రాయలసీమకు చెందిన ఒక బడా నేత కొడుకు నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయని అప్పట్లో రూమర్లు నడిచాయి. తన తండ్రి గురించి తప్పుగా చూపిస్తే తాట ఒలిచేస్తానని వర్మను అప్పట్లో బెదిరించారట. దీంతో మనకెందుకు వచ్చిన గొడవలే అని ‘రక్తచరిత్ర 2’లో ఆ పెద్దాయన పాత్రను వర్మ పాజిటివ్‌గా మలిచారని అంటుంటారు. అంతేకాదు, ఈ రెండో భాగంలో స్లో మోషన్ వీడియోలు పెట్టి సినిమా నిడివిని కూడా పెంచారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు అలాంటి వార్నింగే మళ్లీ వర్మకు వచ్చిందని గుసగుసలు. పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఓ బడా నేత వర్మకు హెచ్చరికలు జారీ చేశారట. ఇది వర్మ ‘పవర్ స్టార్’ సినిమా ప్రకటించినప్పుడే జరిగిందని అంటున్నారు. ఈ చిన్న సినిమాలో వర్మ ఎట్టిపరిస్థితుల్లో పవర్ స్టార్‌ను తక్కువ చేసి చూపించరట. ఇతర పొలిటికల్ లీడర్స్‌పై మాత్రం సెటైర్లు ఉంటాయని టాక్. కాకపోతే, ఈ విషయం బయటపడితే ఎవరూ ఈ సినిమాను చూడరని.. అందుకే తన స్టైల్లో వివాదాస్పద పోస్టర్లతో ‘పవర్ స్టార్’ను వర్మ ప్రచారం చేసుకుంటున్నారని ఇండస్ట్రీల వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో ‘పవర్ స్టార్’ వచ్చేంత వరకు ఆగాల్సిందే.

Related posts