telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : ఇంటి నుంచి శ్రీముఖి అవుట్ ?

sreemukhi army like as kaushal army for bigg boss show

బిగ్ బాస్ సీజ‌న్-3 ప్రారంభ‌మై 15 మంది కంటెస్టెంట్స్‌తో ఇప్ప‌టికే రెండు ఎలిమినేష‌న్స్ పూర్త‌య్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళ‌గా, రెండో వారం జాఫ‌ర్‌ని ఎలిమినేట్ చేశారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో 14 మంది స‌భ్యులు ఉండ‌గా… ఈ వారం నామినేష‌న్‌లో ఎక్కువ ఓట్లు పొందిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌లో నిలిచారు. మూడోవారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ దొంగ‌లున్నారు జాగ్ర‌త్త అనే టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్‌లో భాగంగా తికమకపురం ఊరి పెద్దగా వరుణ్‌ సందేశ్‌,తమన్నాలు ఉండ‌గా.. ఊరిలో ఓ జంటగా అలీ , పున‌ర్న‌వి.. అన్న‌ద‌మ్ములుగా రాహుల్ ,మ‌హేష్‌.. అక్క చెల్లెళ్లుగా రోహిణి, వితిక‌ పని కోసం ఎదురు చూసే లాయర్‌గా హిమజగా ఉన్నారు. బద్దకస్తుడైన పోలీస్‌ ఆఫీసర్‌ బాబా భాస్కర్‌.. స్ట్రిక్ట్‌ కానిస్టేబుల్‌గా శివజ్యోతి. ఇక దొంగలైన అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణలు దొంగతనాలు చేస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకుని జైల్లో వేస్తున్నారు.

ఈ క్రమంలో కెప్టెన్ టాస్క్‌లో దొంగ‌లుగా ఉన్న శ్రీముఖి, అషూ, ర‌విలు నిధిని దొంగిలించేందుకు అనేక ప‌థ‌కాలు వేశారు. ర‌విని బ‌య‌ట‌కి తీసుకొచ్చి శ్రీముఖి, అషూలు నిధి అద్దాల‌ని ప‌గ‌ల‌గొట్టాల‌ని డిసైడ్ అయ్యారు. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం డంబెల్‌తో నిది ద‌గ్గ‌ర‌కి వెళ్లిన శ్రీ ముఖి… నిధి చుట్టు వరుణ్, వితికా, తమన్నా, మహేష్‌లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టింది. రవిని సైతం పగలగొట్టమమని శ్రీముఖి సలహా ఇస్తూ డంబెల్ అతని చేతికి అందివ్వడానికి ప్రయత్నించగా… అది అందుకోవడం రవికి కుదరక చేతితో అద్దాలను పగలగొట్టాడు. దీంతో అతని చేతికి బ‌ల‌మైన గాయం కావ‌డంతో పాటు రక్తం ధార‌ళంగా పారింది. వెంట‌నే అత‌నిని మెడిక‌ల్ రూంలోకి తీసుకెళ్లి చికిత్స అందించారు వైద్యులు. శ్రీముఖి త‌ప్పుడు ఆలోచ‌న‌తోనే ర‌వికి గాయ‌మైంద‌ని వితికా, రాహుల్‌లు ఆమెపై ఫైర్ అయ్యారు. రోహిణి … శ్రీముఖికి స‌పోర్ట్ చేసి మాట్లాడుతున్న‌ప్ప‌టికి త‌ప్పంతా శ్రీముఖిదే అని వారు గ‌ట్టిగా వాదించారు. నిధికి సంబంధించిన విలువైన వ‌స్తువుల‌న్ని వ‌రుణ్ సోఫాలో ప‌డేశాడు. అవ‌న్ని ర‌వి కృష్ణ‌కే ఇవ్వాల‌ని కొంద‌రు అన్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఈ టాస్క్ కంటిన్యూ అవుతుంది. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. ఇందులో బిగ్ బాస్ శ్రీముఖికి వార్నింగ్ ఇస్తున్నారు. హౌస్ నియమాలు ఉల్లఘించిన కారణంగా శిక్షగా శ్రీముఖిని ఇంటి నుండి బయటకి పంపడానికి అంటూ ప్రోమోని ఎండ్ చేశారు. నిజంగానే శ్రీముఖిని ఇంటి నుండి బయటకి పంపుతారా..? లేక ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా..? అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Related posts