telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ సీజన్-4 కంటెస్టెంట్స్ లిస్ట్… ఎవరెవరంటే…!?

Bigg-Boss-4

బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో విడుదలై వైరల్ గా మారింది. ఎప్పుడు? ఎక్కడ? హోస్ట్ ఎవరనే విషయాలను చెప్పకపోయినప్పటీ బిగ్ బాస్ సీజన్ 4 మరో రెండు వారాల్లో ప్రారంభం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా బిగ్ బాస్ షో నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ రెండు వారాలు ముందుగానే బిగ్ బాస్ హౌస్‌లో ఉండి.. ఆ తరువాత వారితో షో కంటిన్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాలు వైద్యుల పర్యవేక్షలో ఉంచి ఆ తరువాత కరోనా నేపథ్యంలో హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే అప్పుడు వారిని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట నిర్వాహకులు. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితెర వర్గాల్లో మొదలైంది. 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో ఎంత మంది బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారనేది తెలియాల్సి ఉంది.

1. పూనమ్ భజ్వా
2. శ్రద్దాదాస్
3. హంసా నందిని
4. సింగర్ సునీత
5. మంగ్లీ (సింగర్)
6. మహాతల్లి (యూట్యూబ్ సంచలనం)
7. వైవా హర్ష
8. అఖిల్ సార్దక్
9. యామినీ భాస్కర్
10. హీరో నందు (గీతా మాధురి భర్త)
11. అపూర్వ
12. పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్)
13. మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్)
14. ప్రియ వడ్లమాని
15. సింగర్ నోయల్

Related posts