telugu navyamedia
telugu cinema news trending

“మా బాలుని జాగ్రత్తగా దాచుకో స్వామి…” బాలుకు “బిగ్ బాస్-4” ఘన నివాళి

SPB

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం ఎంతో మందిని విషాదంలో ముంచెత్తింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కన్నీటితో ఎస్పీ బాలుకు వీడ్కోలు పలికారు. తన 50 ఏళ్ల కెరీర్ లో 16 పైగా భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి భారతదేశ సంగీత చరిత్రలో అరుదైన ఘనతను దక్కించుకున్నారు ఎస్పీ బాలు. ఎన్నో దశాబ్దాల పాటు తన అమృతగానంతో సంగీత ప్రియులను అలరించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హఠాన్మరణం కొన్ని కోట్ల మందిని కలిచి వేసింది. అయితే ప్రస్తుతం ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్-4’ కార్యక్రమం ద్వారా బాలుకు నాగార్జున ఘనంగా నివాళులర్పించారు. “ఆ స్వరం ఇక పలకదని, ఆ వరం మనకిక లేదని, సరిగమలు కన్నీళ్లు పెట్టాయి. రాగాలన్నీ బాధపడ్డాయి. కానీ ఆయన గానాన్ని మనం ఎప్పటికీ ఆస్వాదిస్తూనే ఉంటాం. దాచుకో స్వామి దాచుకో.. మా బాలుని జాగ్రత్తగా దాచుకో” అంటూ నాగార్జున పేర్కొన్నారు. ఆ వీడియోను నాగార్జున ట్విటర్ ద్వారా షేర్ చేశారు.

Related posts

కలిసి పోరాటానికి సిద్దమైన .. బీజేపీ-జనసేన…

vimala p

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు…క్లీన్ చిట్.. వాడుతున్నారు.. అమ్మట్లేదట..

vimala p

బాలీవుడ్ రీమేక్ కు అక్కినేని హీరో గ్రీన్ సిగ్నల్ ?

vimala p