105 రోజుల బిగ్ బాస్ నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో ఆదివారం నాడు విజేతను ప్రకటించారు. బిగ్‌బాస్ తెలుగు 3 టైటిల్‌ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్నాడు రాహుల్. కాగా… 15 వారాల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ షోలో అందరితో పోటి పడి చివరకు రాహుల్ విజేతగా నిలిచారు. ఈ పోటిలో యాంకర్ శ్రీముఖి రాహుల్‌కు గట్టి పోటీ నిచ్చారు. టైటిల్‌ను గెలిచిన సందర్బంగా రాహుల్, వరుణ్ పార్టీ చేసుకున్నారు. వారిద్దరి ఫోటోలను, వీడియోను పునర్నవి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో రాహుల్, వరుణ్‌లు ఒకరిమీద ఒకరు పడుతూ.. బ్రోమాన్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
previous post